ప్రపంచ కప్‌ జట్టు ప్రకటన | Babette de Leede to captain Netherlands in their maiden Women's T20 World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచ కప్‌ జట్టు ప్రకటన

May 6 2026 6:47 PM | Updated on May 6 2026 7:16 PM

Babette de Leede to captain Netherlands in their maiden Women's T20 World Cup

తమ తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం నెదర్లాండ్స్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా బాబెట్ డి లీడేను ఎంపికైంది. బాబెట్కు క్రికెట్ వారసత్వం ఉంది. ఆమె మామ టిమ్‌ డి లీడే, కజిన్ బాస్‌ డి లీడే ఇప్పటికే పురుషుల వరల్డ్ కప్‌లలో నెదర్లాండ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాబెట్‌ డి లీడే మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టుకు నాయకత్వం వహించనుండటం విశేషం.

కాగా, మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌లోని వివిధ వేదికల్లో జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్‌ జట్టు భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ లాంటి పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్‌-ఏలో ఉంది. 

ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడనుంది. కాగా, నెదర్లాండ్స్‌ జట్టు ఈ ఏడాది నేపాల్‌లో జరిగిన గ్లోబల్ క్వాలిఫయర్‌లో కీలక విజయాలు సాధించి, తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

నెదర్లాండ్స్ జట్టు: బాబెట్ డి లీడే (సి), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, హన్నా లంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోర్, రాబిన్‌ రిజ్కే, రోస్లీ లారెన్స్‌, సాన్యా ఖురానా, సిల్వర్‌ సీగర్స్, స్టెర్రే కాలిస్

Advertisement
 
Advertisement
Advertisement