దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్‌పై కోపంతో ఊగిపోయిన బాబర్‌ ఆజం! వీడియో వైరల్‌ | Babar Azam Slams Mohammad Nawaz After SA Game Blunder | Sakshi
Sakshi News home page

WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్‌పై కోపంతో ఊగిపోయిన బాబర్‌ ఆజం! వీడియో వైరల్‌

Oct 28 2023 10:56 AM | Updated on Oct 28 2023 11:42 AM

Babar Azam Slams Nawaz After SA Game Blunder - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో పాక్‌ పరాజయం పాలైంది. ఈ ఓటమితో పాకిస్తాన్‌ సెమీస్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిందే అనే చెప్పాలి.

మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. దక్షిణాఫ్రికా విజయంలో మార్‌క్రమ్‌(91) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ మార్‌క్రమ్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు  నడిపించాడు. అయితే విజయానికి మరో 21 పరుగులు అవసరమైన సమయంలో ఉసామా మిర్ బౌలింగ్‌లో మార్‌క్రమ్ అవుటయ్యాడు.

ఆ వెంటనే షాహిన్ ఆఫ్రిది.. కొయెట్జిని అవుట్ చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో కేశవ్‌ మహారాజ్‌ ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించాడు.  దక్షిణాఫ్రికా 47. 2 ఓవర్లలో 271 లక్ష్యాన్ని చేరుకుంది.  పాక్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ఉసామా మీర్‌, వసీం​ తలా రెండు వికెట్లు సాధించారు.

బాబర్‌ సీరియస్‌..
కాగా ఈ మ్యాచ్‌ అనంతరం స్పిన్నర్‌ మహ్మద్‌ నవాజ్‌పై పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కోపంతో ఊగిపోయాడు. ఫస్ట్‌ బౌలర్ల బౌలింగ్‌ కోటా ముగియడంతో నవాజ్‌ చేతికి బంతి అందించాడు. బాబర్‌ నమ్మకాన్ని నవాజ్‌ నిలబెట్టుకోలేకపోయాడు. తన వేసిన 48 ఓవర్‌లో రెండో బంతికే ఫోర్‌ ఇచ్చి మ్యాచ్‌ను ప్రోటీస్‌కు సమర్పించుకున్నాడు. ఫీల్డర్లు మొత్తం ఆఫ్‌ సైడ్‌ ఉంటే నవాజ్‌ మాత్రం బంతిని లెగ్‌ సైడ్‌ వైపు వేశాడు.

మహారాజ్‌ ఈజీగా స్వ్కెర్‌ లెగ్‌ వైపు బంతిని బౌండరీకి తరిలించాడు. ఈ క్రమంలో నవాజ్‌పై బాబర్‌ ఆజం కోపంతో ఊగిపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి ఆ ఒక్క బాల్‌ వేయడం తప్ప ఇంకేమీ రాదా? అంటూ సీరియస్‌ అయ్యాడు. అందుకు బదులుగా నవాజ్‌ సమాధానం ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిWC 2023: గ్రీన్‌ అవుట్‌.. ట్రవిస్‌ హెడ్‌ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement