Asia Cup 2022: చహల్‌ను ముద్దు పెట్టుకున్న విరాట్ కోహ్లి.. వీడియో వైరల్

ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా ఈ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్లు పర్వాలేదన్పించిన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు.
కాగా శ్రీలంక కోల్పోయిన ఆ నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లు పడగొట్టినవే. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన యజువేంద్ర చాహల్ వరుసగా నిసంకా(52), ఆసలంక(0)ను పెవిలియన్‌కు పంపాడు. అదే విధంగా మళ్లీ 15 ఓవర్ వేసిన చాహల్ మంచి ఊపు మీద ఉన్న కుశాల్ మెండిస్(57)ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు.
ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. చాహల్‌ను ముద్దుపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం.
#ViratKohli kisses #YuzvendraChahal #INDvsSL pic.twitter.com/5XHuQjfHCf
— Cricket fan (@Cricket58214082) September 6, 2022
చదవండి: Asia Cup 2022: 'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్'
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు