Virat Kohli-Anushka Sharma: లండన్‌ వీధుల్లో విరుష్క దంపతుల చక్కర్లు

Anushka Sharma Shares Adorable Picture With Husband Virat Kohli Viral - Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లి మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే టీమిండియా ఆసియా కప్‌ గెలవడంలో విఫలమైనప్పటికి కోహ్లి సెంచరీతో సూపర్‌ ఫామ్‌లోకి రావడం ఫ్యాన్స్‌ను సంతోషపరిచింది. త్వరలో జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున కోహ్లి కీలకం కానున్నాడు. ఇక సోమవారం ప్రకటించిన టి20 ప్రపంచకప్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లకు కోహ్లి ఎంపికయ్యాడు.

కాగా ఆసియా కప్‌ ముగిసిన తర్వాత కోహ్లి షార్ట్‌బ్రేక్‌ తీసుకున్నాడు. తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక సూపర్‌ ఫోటోను షేర్‌ చేసింది.  ఆ ఫోటోలో ఒక కాఫీ షాపు వద్ద కోహ్లి, అనుష్కలు వేడివేడిగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఫోటోలో వామికా లేదు.. కేవలం విరుష్క దంపతులు మాత్రమే కనిపించారు. ఈ ఫోటోను అనుష్క షేర్‌ చేసిన కాసేపటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న అనుష్క శర్మ ప్రస్తుతం ఆమె నటిస్తున్న చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ సినిమా లండన్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా టీమిండియా  దిగ్గజ మహిళా ఫాస్ట్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా ''చక్‌దా ఎక్స్‌ప్రెస్‌'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top