
నింగ్బో (చైనా): భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే గురి కుదరక పతకం బరికి దూరమవుతున్నారు. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో గురువారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమా మహేశ్ సహా దివ్యాన్‡్ష, రాహీ సర్నోబత్‌లు క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్‌లో దివ్యాన్‡్ష 630 స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. ఉమామహేశ్ 627.7 పాయింట్లు స్కోరు చేసి 39 స్థానంలో, మరో భారత మరో షూటర్ నీరజ్ కుమార్ (626.1) 54వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాపిడ్ ఫైర్ క్వాలిఫికేషన్‌లో అభిజ్ఞ అశోక్ పాటిల్ 583 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది.
టీఎస్ దివ్య (581), ఒలింపియన్, ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ (581)లు వరుసగా 16, 17 స్థానాలు పొందారు. ఇప్పుడిక భారత్ ఆశలన్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌పైనే ఉన్నాయి. మెహులీ ఘోష్, తెలంగాణ అమ్మాయి సురభి రాపోలు, మానిని కౌశిక్‌లు బరిలో ఉన్నారు.