హెడ్‌కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్‌ | Andrew Flintoff Joins Big Bash League As Sydney Thunder Head Coach | Sakshi
Sakshi News home page

హెడ్‌కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్‌

Jun 2 2026 5:19 PM | Updated on Jun 2 2026 6:00 PM

Andrew Flintoff Joins Big Bash League As Sydney Thunder Head Coach

ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తొలిసారి విదేశీ లీగ్‌లో కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్‌ తమ హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్‌ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఒకసారి ఫైనల్‌.. కానీ రెండుసార్లు..
కాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ట్రెవర్‌ బేలిస్‌ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలోనే 2024-2025లో జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే, 2023-24, 2025-26 సీజన్లలో మాత్రం దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్‌ బేలిస్‌పై వేటు వేసి అతడి స్థానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను తీసుకువచ్చింది. కాగా ఫ్లింటాఫ్‌ గతంలో ది హండ్రెడ్‌ లీగ్‌లో నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌కు కోచ్‌గా పనిచేశాడు.

అత్యుత్తమ ఆల్‌రౌండర్‌
అంతేకాదు.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్లకు 2023-24 సీజన్‌కు గానూ కన్సల్టెంట్‌గా ఫ్లింటాఫ్‌ వ్యవహరించాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుకు మార్గదర్శనం చేశాడు. కాగా ఇంగ్లండ్‌ అందించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఒకడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌ తరఫున 1998- 2010 వరకు ఫ్లింటాఫ్‌ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3845 పరుగులు చేసిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 226 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3394 పరుగులు చేయడంతో పాటు 169 వికెట్లు కూల్చాడు.

ఇక ఏడు టీ20లలో కలిపి 76 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ . కాగా సిడ్నీ థండర్‌ తొలుత డాన్‌ క్రిస్టియన్‌, షేన్‌ వాట్సన్‌లను సంప్రదించినట్లు సమాచారం. అయితే, వారి కంటే 48 ఏళ్ల ఫ్లింటాఫే తమ జట్టుకు సరైన కోచ్‌ అని భావించి.. అతడితో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

చదవండి: ODI WC: రోహిత్‌ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement