Indian Wells: ‘నంబర్‌వన్‌’ అల్‌కరాజ్‌.. ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ సొంతం

Alcaraz reclaims world no 1 ranking, Nadal out of top 10 - Sakshi

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ సొంతం

మళ్లీ ‘టాప్‌’ ర్యాంక్‌లోకి స్పెయిన్‌ స్టార్‌

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్పెయిన్‌ యువ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్‌కరాజ్‌ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలుపొందాడు.

అల్‌కరాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్‌ మెద్వెదెవ్‌కు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. మయామి ఓపెన్‌లోనూ టైటిల్‌ సాధిస్తేనే... ఇండియన్‌ వెల్స్‌ టోర్నీకి ముందు రెండో ర్యాంక్‌లో ఉన్న అల్‌కరాజ్‌ తాజా విజయంతో 7,420 పాయింట్లతో మరోసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్‌ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్‌ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్‌ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.

సోమవారం మొదలైన మయామి ఓపెన్‌ టోర్నీలోనూ అల్‌కరాజ్‌ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్‌ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ మళ్లీ టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. మరోవైపు స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌ 18 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్‌–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. రిబాకినా తొలిసారి... ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మహిళల టోరీ్నలో కజకిస్తాన్‌ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తొలిసారి విజేతగా నిలిచింది.

ఫైనల్లో రిబాకినా 7–6 (13/11), 6–4తో రెండో ర్యాంకర్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సబలెంకా (బెలారస్‌)పై గెలిచింది. తాజా ప్రదర్శనతో రిబాకినా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. విజేత రిబాకినాకు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్‌ సబలెంకాకు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top