Afghanistan Likely To Tour India After ICC WTC Final 2023: Says Reports - Sakshi
Sakshi News home page

IND vs AFG: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత పర్యటనకు ఆఫ్గానిస్తాన్‌! 5 ఏళ్ల తర్వాత

Published Sat, Apr 15 2023 12:57 PM

Afghanistan to tour India after WTC Final 2023: reports - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో ఆసీస్‌తో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. వన్డే ప్రపంచకప్‌ సన్నహాకాల్లో భాగంగా బీసీసీఐ పలు స్వదేశీ, విదేశీ సిరీస్‌లను ప్లాన్‌ చేసింది.

ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ ఏడాది జూన్‌లో ఆఫ్గాన్‌ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సిరీస్‌ ఐసీసీ ఫ్యూటర్‌ టూర్‌ ప్రోగామ్‌లో భాగంగా జరగడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌ను ప్రసారం చేసేందుకు మధ్యంతర మీడియా హక్కుల టెండర్లను బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఎందుకంటే స్టార్‌ ఇండియాతో మార్చి నెలాఖరుతో బీసీసీఐ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు.

"మీడియా హక్కుల టెండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది (జూన్-జూలై)లో విడుదల చేయబడుతుంది. ఆఫ్గాన్‌ సిరీస్‌కు విడిగా టెండర్లను ఆహ్వానించే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పూర్తి స్థాయి బ్రాడ్‌క్రాస్టింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది" అని జై షా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఆఫ్గానిస్తాన్‌ చివరగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్గానిస్తాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది. కాగా ఆఫ్గాన్‌కు అదే తొలి టెస్టు మ్యాచ్‌ కావడం గమనార్హం.
చదవండిIPL 2023: కోల్‌కతా కెప్టెన్‌ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్‌

Advertisement
Advertisement