ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ! | Sakshi
Sakshi News home page

IPL 2024 Mini Auction: ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ!

Published Sat, Dec 2 2023 6:12 PM

1166 Players Registered For IPL 2024 Mini Auction - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ మినీ వేలానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే మొత్తం 10 ఫ్రాంఛైజీలు తమ రిటేన్షన్‌ జాబితాను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు సమర్పించాయి. వేలానికి ముందే ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

ఈ డీల్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వేలంలో 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్‌ చేస్తున్నారు. ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 212 మంది క్యాప్డ్ ప్లేయర్లు..  909 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 45 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

అయితే ఐపీఎల్‌ ప్రాంఛైజీలలో మొత్తం కలిపి 77 స్ధానాలు ఖాలీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్‌ విదేశీ క్రికెటర్లవే కావడం గమనార్హం. కాగా వేలానికి ముందు 1166 మంది ఆటగాళ్లను ఫిల్టర్‌ చేసి ఫైనల్‌ లిస్ట్‌ను తాయరు చేసే ఛాన్స్‌ ఉంది.  ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర పలికే అవకాశముంది.

వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ వంటి వారి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన కివీస్‌ యవ సంచలనం రచిన్‌ రవీంద్ర కూడా భారీ ధరకు అమ్ముడుపోయే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వేలంలో శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా గాయం కారణంగా తన పేరును నమోదు చేసుకోలేదు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌! తిలక్‌ రీ ఎంట్రీ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement