కొత్త ఫ్రెండ్​ను పాంపరింగ్​ చేస్తున్న ధోని.. వైరల్​ వీడియో

Video of MS Dhoni Pampering His New Friend Chetak Goes Viral - Sakshi

రాంచీ: మహేంద్ర సింగ్​ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన మన భారత్​ టీంకు గతంలో  కెప్టెన్​గా ఉన్నారు. అతని వికెట్‌ కీపింగ్ స్టెయిల్స్, హెయిర్​ స్టెయిల్​ను ఎంతో మంది కుర్రకారు కాపీ కొడుతూ ఉంటారు. అయితే, ఆయనకు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఏ మాత్రం తీరిక దొరికినా వాటితోనే సమయం గడపటానికి ఇష్టపడతారు. అయితే, తాజాగా,  ఆయన భార్య సాక్షి సింగ్​ ఇన్​స్టాలో పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఆయన ఒక కొత్త గుర్రాన్ని ఇంట్లో తెచ్చుకున్నారు. దాన్ని కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దానికి ‘చేతక్​’ అని పేరుకూడా పెట్టారు. అయితే, గుర్రం ధోని ఇంట్లో పార్క్​లో పడుకుని ఉంది. దాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో చెతక్​ను ప్రేమగా నిమురుతూ, పాంపరింగ్​ చేయటం మొదలు పేట్టాడు. చెతక్​ కూడా ధోని చేస్తున్న మసాజ్​కు ఏమాత్రం కదలకుండా  హాయిగా పడుకుంది. అయితే , ఈ గుర్రంతో పాటు , ఇప్పటికే మరికొన్ని కుక్కలు కూడా ధోని ఇంట్లో ఉన్నాయి.  

కాగా, సాక్షిసింగ్​ తనింట్లో  ఏ కొత్త జంతువును తీసుకొచ్చినా దాన్ని వీడియో తీసి ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్​ గా మారింది. అయితే, ఈ వీడియోను బాలీవుడ్​ నటి బిపాషా బసు, మాజీ మిన్​ ఇండియా అలంక్రిత సహయ్​ కూడా వీక్షించారు.  అయితే, దీన్నిచూసిన నెటిజన్లు ‘వీకెండ్​లో  కొత్త అతిథితో సరదాగా గడుపుతున్నారు’ , ‘ ‘మూగజీవాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు హ్యట్సాఫ్​’ అంటూ  కామెంట్​లు పెడుతున్నారు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top