రిపోర్టర్‌ లైవ్‌ చేస్తుండగా.. గన్‌తో బెదిరించి దోపిడి

TV Reporter Robbed at Gunpoint Live On Air Video Goes Viral - Sakshi

క్విటో: రిపోర్టర్‌ లైవ్‌ ఇస్తుండగా, ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఈనెల 12న ఈక్వెడార్‌లోని ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం వ‍ద్ద మ్యాచ్‌కు సంబంధించి  డైరెక్టివి స్పోర్ట్స్ చానల్‌కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్‌తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు,డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు, అతని స్నేహితుని బైక్‌పై పరారయ్యాడు. అయితే ఇదంతా పట్టపగలే అది కూడా లైవ్‌లో జరగడం గమనార్హం.  దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్‌ డియోగో తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు జర్నలిస్ట్‌తో సహా సిబ్బందికి తమ మద్దతును తెలుపుతున్నారు. ఇక దుండగుడు ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్‌, తలపై టోపీని ధరించాడు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి : (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్‌!)
                (Shweta Memes: ఎందుకింతలా ట్రెండవుతోంది!)

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top