నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, మూల్యాంకన కేంద్రం అధికారి రవీందరెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(కోఎడ్యుకేషన్‌)లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల అధ్యాపకులు రిపోర్టు చేయాలన్నారు. 21 నుంచి ప్రారంభమయ్యే మొదటి విడతలో ఇంగ్లిష్‌, తెలుగు, సివిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల మూల్యాంకనం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన విధులకు హాజరయే అధ్యాపకులను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ రిలీవ్‌ చేయాలని సూచించారు. హాజరు కాని అధ్యాపకులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్‌ బుధవారం పేర్కొన్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం రంగ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్‌ 10న సెలక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు.

గ్రంథాలయాలను

సద్వినియోగం చేసుకోండి

చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం అన్నారు. బుధవారం చిన్నకోడూరులోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉన్న సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటు లో ఉంచుతామన్నారు. ఆయన మండల బీసీ సెల్‌ అధ్యక్షులు చిరంజీవి, నాయకులు సదాశివరెడ్డి, కన్నారెడ్డి, యువకులు ఉన్నారు.

పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ

గజ్వేల్‌: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌లోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల(జనుము, జీలుగ విత్తనాలు)ను పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ భూసారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్‌ ఏడీఏ బాబునాయక్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సర్ధార్‌ఖాన్‌, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.

అటెండర్‌ పోస్టుకు

దరఖాస్తుల ఆహ్వానం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండల విద్యావనరుల కేంద్రం(ఎంఆర్‌సీ)లో ఔట్‌స్సోరింగ్‌ విధానంలో అటెండర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ గుగులోతు రంగానాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి మెమో, స్టడీ, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలు, రెండు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలతో ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement