సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ దుకాణాలు బుధవారం బంద్ నిర్వహించాయి. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆలిండి యా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్‌లు బుధవా రం బంద్ పాటించాయి. మెడిసిన్ కోసం దుకాణాల వద్దకు వచ్చిన వారు విషయం తెలియక నిరాశతో వెనుదిరిగారు. మందులు అవసరమైన వారు ప్రభు త్వాసుపత్రి బాట పట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాప్‌లు మాత్రం యథావిధిగా విక్రయాలు జరిపాయి. మెడ్‌ప్లస్ వంటి షాప్‌లు విక్రయాలు జరిపాయి. మెడికల్ షాప్‌ల బంద్ నేపథ్యంలో అత్యవసర సమయంలో ఏమైనా మందులు అవసరమైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు వైదాధికారులు తెలిపారు. సిద్దిపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 నుంచి 850 మెడికల్ దుకాణాలు బంద్‌లో పాల్గొన్నాయి.
సిద్దిపేట పట్టణంలో మూసి ఉన్న మెడికల్ షాప్
ఆన్‌లైన్‌లో విక్రయాలు నిలిపివేయాలి
గజ్వేల్‌రూరల్: పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ దుకాణాల నిర్వాహకులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు జీఎస్‌ఆర్ 817ను ఉపసంహరించాలన్నారు. అదే విధంగా కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్‌లను నిలిపివేయాలని, జీఎస్‌ఆర్ 220లను ఉపసంహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


