మెదక్‌జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూనియర్ అసిస్టెంట్‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, స్టేనో టైపిస్ట్‌కు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్, నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు.


