ఫలితాల్లో జిల్లా ౖపైపెకి..
● 25 నుంచి 13వ స్థానానికి ● ఈసారి బాలురదే హవా ● 243 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ● చిన్నకోడూరు మండలంలో అందరూ పాస్ ● రాణించిన గురుకులాల విద్యార్థులు
గురుకుల విద్యార్థినికి 585 మార్కులు
వర్గల్(గజ్వేల్): జిల్లా స్థాయిలో వర్గల్ మండలం చౌదరిపల్లి(గజ్వేల్) సోషల్‌వెల్ఫేర్ బాలికల గురుకులం మెరిసింది. టెన్త్ పరీక్షలో సత్తాచాటిన అనుముల అక్షిత 585 మార్కులు సాధించారు. ఏ.జ్యోతిర్మయి (565), డి. మేనక(554) మార్కులు సాధించారు. మొత్తం 78 మంది పరీక్ష రాయగా 77 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు.
పూలే భళా..
వర్గల్(గజ్వేల్): టెన్త్ ఫలితాల్లో వర్గల్ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకులం శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 77 మంది బాలికలు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీ దేవి తెలిపారు. టీ. శ్రీహర్ష (566), ఎం. శిరీష(558) మార్కులతో టాపర్లుగా నిలిచారు. గురుకులంలో శతశాతం ఉత్తీర్ణత నమో దు కావడంపై ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదోతరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. జిల్లా 13వ స్థానంలో నిలిచింది. గత 2024– 25 విద్యాసంవత్సరంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. 2025– 26 ఫలితాల్లో 13వ స్థానానికి ఎకబాకింది. 15,325 మంది విద్యార్థులకు గాను 14,995 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో 7,752 మంది బాలురకు 7,540 మంది, 7,573 మంది బాలికలకు 7,455 మంది ఉత్తీర్ణులయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన మండలంగా చిన్నకోడూరు నిలిచింది. స్పింగ్‌డల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రవళ్లి సాత్విక 595 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎన్సాన్‌పల్లి గురు కులం విద్యార్థిని శ్రీగారి వర్ష 588 మార్కులు సాధించారు. 136 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, 21గురుకులాలు, 13 కేజీబీవీలు, 11 ఆదర్శ స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.
పరీక్షకు హాజరైన విద్యార్థులు: 15,325
ఉత్తీర్ణత సాధించిన వారు : 14,995
ఫెయిల్ అయిన వారి సంఖ్య: 330
జిల్లాలో ఉత్తీర్ణత శాతం: 97.85
అత్యధిక మార్కులు సాధించిన వారు
శ్రీగారి వర్ష (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్‌పల్లి): 588
బొమ్మిడి అమూల్య (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్మేట): 587
దనాల అశ్వప్రియ (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్‌పల్లి): 586


