గజ్వేల్‌రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సీపీడీసీ సభ్యులు లక్ష్మణ్, నరేష్, గోపాల్‌రెడ్డి, సుభాష్‌చంద్రబోస్ తదితరులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేయకుండా విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.


