ఉత్సవ కమిటీ చైర్మన్‌గా కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సవ కమిటీ చైర్మన్‌గా కమలాకర్‌

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

మద్దూరు(హుస్నాబాద్‌): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా రేబర్తి గ్రామానికి చెందిన డాక్టర్‌ జంగిటి కమలాకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కమలాకర్‌ ఆదివారం మాట్లాడుతూ కురుమలు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించుకోవాలన్నారు. 3న రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్య జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తన నియామకానికి సహకరించిన కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, క్యామ మల్లేశంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement