మద్యం తాగి వాహనాలు నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ ఎస్‌ఐ విజయ్‌ భాస్కర్‌ హెచ్చరించారు. సిద్దిపేటలో టాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ఆదివారం అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వాహనం నడిపేటపుడు కచ్చితంగా సీట్‌బెల్ట్‌ ధరించాలన్నారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని, గమ్యస్థానం చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అఖిల్‌, మహేశ్‌, టాక్సీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అబ్బు, రమేశ్‌, డ్రైవర్లు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement