ఏఎంసీ చైర్మన్‌గా మీసం మహేందర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీ చైర్మన్‌గా మీసం మహేందర్‌

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

చిన్నకోడూరు(సిద్దిపేట)/నంగునూరు(సిద్దిపేట): చిన్నకోడూరు, నంగునూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ల పేర్లను రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆదివారం ప్రకటించారు. చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా అల్లీపూర్‌ గ్రామానికి చెందిన మీసం మహేందర్‌ను నియమించారు. అలాగే నంగునూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దేవులపల్లి యాదగిరిని నియమించారు. ఈ మేరకు మంత్రి వివేక్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు వారికి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీసం మహేందర్‌ మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement