సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత

గజ్వేల్‌రూరల్‌: నడక, ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని అదనపు సీఐ ముత్యంరాజు అన్నారు. సూర్యనమస్కారాల బృందం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సూర్య నమస్కారాల బృందం సభ్యులు సుభాష్‌రెడ్డి, బాల్‌చంద్రం, సుదర్శన్‌చారి, నర్సింహులు, కృష్ణ, భిక్షపతి, రవికుమార్‌, శ్రీకాంత్‌, యాదగిరి, ల్యాబ్‌ రమేశ్‌, బాల్‌కుమార్‌, మధు, విశ్వనాథం, జితేందర్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు

యువత చెడు వ్యసనాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్య నమస్కారాల బృందం సభ్యులు సూచించారు. డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడితే కలిగే అనర్థాలపై అవగాహన కలిగించేందుకు ఇన్‌స్ఫైర్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 19న నిర్వహించతలపెట్టిన 3కే రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. గజ్వేల్‌లో సూర్య నమస్కారాల బృందం, వాలీబాల్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో గోపాల్‌, కేతోజి వినోద్‌కుమార్‌, నవీన్‌, స్వామి, భాస్కర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

అదనపు సీఐ ముత్యంరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement