బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ వేడుకలు ఆదివారం వైభంగా నిర్వహించారు. అర్చకుడు శేషం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, సర్పంచ్ శ్రీధర్, దంపతులు, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌రూరల్: పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేసినట్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు తెలిపారు. పోతారం(ఎస్), పందిల్ల, మహ్మదాపూర్ గ్రామాలకు చెందిన 29 మందికి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మామిడి చంద్రకళ, రమేశ్, తిరుమల, ఉపసర్పంచ్ బొమ్మగాని రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


