మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పారుఖ్‌ అహ్మద్‌, గౌరవ అధ్యక్షుడు మహమ్మద్‌ జాకీర్‌హుస్సేన్‌, కార్యదర్శి మహమ్మద్‌ అక్తర్‌ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్‌ సందాని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షేక్‌ ఇమ్రాన్‌, జనరల్‌ సెక్రెటరీగా అబ్దుల్‌ మోయిజ్‌, కోశాధికారిగా సయ్యద్‌ ఖాజా నవాజ్‌ అహ్మద్‌తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, షబానాజ్‌, సబిహా తహసీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement