తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ప్రజలు అనవసర అందోళనకు గురై ఒకేసారి బంకులకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పంపిణీకి అంతరాయం కలుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు.


