మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
22 నెలల తర్వాత పంచాయతీలకు సర్పంచ్‌లు
బాధ్యతల నుంచి తప్పుకున్న
ప్రత్యేక అఽధికారులు
గ్రామాల్లో పండుగ వాతావరణం
జగదేవ్‌పూర్‌లో
ప్రమాణ స్వీకారం ఉద్రిక్తం
పార్టీల మధ్య మాటల యుద్ధం
పోలీసుల చొరవతో
సద్దుమణిగిన వివాదం
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బోల్తాపడిన సిమెంట్ బస్తాల ట్రాక్టర్
పల్లె సారథులు వచ్చేశారు..
సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీల్లో సోమ వారం నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిబ్రవరి 2, 2024న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీలకు సర్పంచ్‌లు వచ్చారు. ప్రత్యేక అధికారుల నుంచి బాధ్యతలను సర్పంచులు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలో 508 సర్పంచ్‌లకు గాను 507 మంది సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. కోహెడ మండలం తంగళ్లపల్లి సర్పంచ్ సంపత్ తండ్రి మృతి చెందడంతో ప్రమాణస్వీకారం చేయలేదు.
బడిలో ప్రమాణం
వర్గల్(గజ్వేల్): చాంద్‌ఖాన్‌మక్త పంచాయతీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో మదిర గ్రామమైన లింగారెడ్డిపల్లి స్కూల్ బిల్డింగ్‌లో కొనసాగుతోంది. విద్యార్థులు లేకపోవడం.. స్కూల్ పొరుగు పాఠశాలలో విలీనమవడంతో ఆ భవనాన్ని పంచాయతీకి వినియోగిస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ మేదిని సజనిత, ఉపసర్పంచ్ కనకయ్య, వార్డుసభ్యులు లింగారెడ్డిపల్లి పాఠశాల భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా సామలపల్లి పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో ఇరుకై న అద్దెగదిలోనే సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
జగదేవ్‌పూర్‌లో పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం
గజ్వేల్: కుర్చీల లొల్లితో జగదేవ్‌పూర్ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వార్డు సభ్యులు నినాదాలతో వాగ్వాదానికి దిగారు. ఒకనొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలో సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి పనగట్ల శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డుల్లో 8 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా, 5స్థానాల్లో కాంగ్రెస్, మరొక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. సోమవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా పంచాయతీ భవనం వెలుపలా కుర్చీలు ఏర్పాటుచేశారు. పరిమితంగా ఏర్పాటు చేయడం వల్ల అప్పటికే బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు, నాయకులు వచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు సభ్యులకు కుర్చీలు లేవు. దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడుతూ.. జై కాంగ్రెస్, జై బీజేపీ అంటూ నినాదాలు మొదలెట్టారు. ఈ సందర్భంగా పార్టీల నేతల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్ నేతలు సైతం పోటీగా జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. ఫలితంగా ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పార్టీల నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటకు దారి తీసి.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణారెడ్డి తన సిబ్బంది అక్కడికి చేరుకొని నేతలను సముదాయించి ఉద్రికత్తకు తెరదించారు. ఆ తర్వాత వార్డు సభ్యుల వారీగా కుర్చీలను ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.
చాలా చోట్ల మాజీ సర్పంచ్‌లు ఓటమి
పాలకవర్గాలు కొలువుదీరాయ్..
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


