నిరాకరిస్తున్న రైస్ మిల్లర్లు
గట్లమల్యాల కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వడ్లను ఆరు రైస్ మిల్లులకు కేటాయించడంతో దిగుమతి చేసుకున్నారు. నిల్వ ఉన్న 1,500 బస్తాలు పది రోజులు గడిచినా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే బస్తాలు వేయడంతో రాత్రి పూట కాపు కాయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా రైస్ మిల్లుకు వెళితే తమ వద్దకు రావొద్దని, ఐకేపీ నిర్వాహకులను అడగాలని సమాధానం ఇస్తున్నారు. ఈవిషయమై కొనుగోలు కేంద్రం నిర్వహకులను వివరణ కోరగా పది రోజుల నుంచి లారీలు రావడంలేదన్నారు. మిల్లర్లకు ఫోన్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తున్నాయని, తమ టార్గెట్ పూర్తయి. గోదాములు ఖాళీగా లేకపోవడంతో దిగుమతి చేసుకోవడం లేదన్నారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.


