కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల వాగ్వాదం
వర్గల్(గజ్వేల్): ప్రమాణస్వీకారాల వేళ వర్గల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలతో వేడెక్కింది. వర్గల్ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వాములవుదామని పంచాయతీ వేదికగా సర్పంచ్ దేవగణిక జయభారతి, ఉపసర్పంచ్ టేకులపల్లి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరుపార్టీల శ్రేణుల మధ్య తోపులాటకు దారితీసింది. వెంటనే గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. ఆ తరువాత సన్మానాల కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి.


