అధిక కేసులు రాజీ కుదర్చండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 21న జరగనున్న దృష్ట్యా అధిక కేసులు రాజీకుదిర్చేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక కోర్టు న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేలా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, న్యాయమూర్తులు తరణి, రేవతి, ప్రమీద, స్వాతిగౌడ్, జితేందర్, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు.


