ఓటర్లను తరలించిన అభ్యర్థులు
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలసవెల్లిన పల్లె వాసులు తమ సొంత గ్రామానికి చేరుకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓట్లు వేయించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఒంటి గంటకు పోలింగ్ కేంద్రం గేటు తాళం వేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు.


