పోటెత్తి.. ఓటెత్తి
మొత్తం ఓటేసింది 5.62 లక్షల మంది హక్కు వినియోగంలో పురుషులే అధికం అత్యధికంగా కుకునూరుపల్లి.. అత్యల్పంగా జగదేవ్‌పూర్
● 150 సర్పంచ్, 1,182 వార్డుల్లో ఎన్నికలు ● భారీగా తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు
తుది విడత పోలింగ్ 88.45 శాతం నమోదు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధ వారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండపాక, కుకునూరుపల్లి, జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, హుస్నాబాద్ పరిధిలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు13 మినహాయిస్తే 150 సర్పంచ్ పదవులకు, 574 అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 249 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,182వార్డు స్థానాలకు 3,059 పోటీ చేశారు. తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
కుకునూరుపల్లిలో అత్యధికం
మూడో(చివరి) విడతలో 88.45శాతం పోలింగ్ నమోదైంది. కుకునూరుపల్లి మండలంలో అత్యధికంగా 91.08 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా చేర్యాలలో 86.87 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుషులే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మూడు విడతల్లో ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు
మండలాల వారీగా..
అక్కన్నపేట 29,441(88.06 శాతం)
చేర్యాల 28,911(86.87 శాతం)
దూల్మిట్ట 11,975(89.70 శాతం)
హుస్నాబాద్ 14,976(89.46 శాతం)
కోహెడ 33,002(88.38 శాతం)
కొమురవెల్లి 13,842(87.49 శాతం)
కొండపాక 23,488(89.05 శాతం)
కుకునూరుపల్లి 12,976(91.08 శాతం)
మద్దూరు 15,642(88.24 శాతం)
తొమ్మిది మండలాల్లో..
మొత్తం ఓటర్లు: 2,08,314
పురుషులు: 1,02,716
మహిళలు: 1,05,595
ఇతరులు: 03
ఓటు హక్కు వినియోగించుకున్న వారు
పురుషులు 91,492 (89.07%)
మహిళలు 92,759 (87.84%)
ఇతరులు 02
మొత్తం 1,84,253 (88.45%)
ఉదయం 9 గంటల వరకు
పోలైన ఓట్లు: 50,727 (24.35%)
ఉదయం 11 గంటల వరకు.. : 1,25,311 (60.15%)
మధ్యాహ్నం 1 గంట వరకు.. : 1,80,692 (86.74%)
పోలింగ్ ముగిసే సమయం వరకు:
1,84,253 (88.45%)


