అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్ మండలాల్లో కాంగ్రెస్ మద్దతు దారులు సర్పంచ్‌లుగా గెలిచిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉన్న నాయకులకు పట్టం కట్టారన్నారు.


