వడ్డీలేని రుణాలు.. మాకేవి? పట్టణాల్లోని మహిళా సంఘాలకు వ
న్యూస్‌రీల్
పంచాయతీ పోరు..
జోరు
మొదటి రోజు సర్పంచ్‌లకు 131, వార్డు సభ్యులకు 75 నామినేషన్లు
సాక్షి, సిద్దిపేట: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది. తొలి విడతలో 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 41 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఆయా క్లస్టర్లలో ఆర్వో, ఏఆర్వోలను నియమించారు. మొదటి రోజు సర్పంచ్‌లుగా 131, వార్డు సభ్యులుగా 75 నామినేషన్లు వచ్చాయి. కలెక్టర్ హైమావతి, ఎన్నికల పరిశీలకురాలు హరిత నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ ఏడు మండలాల్లో శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకోవచ్చు. వచ్చేనెల 11న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏకగ్రీవానికి వేలం పాటలు
ఎన్నికల నియమావళి
అతిక్రమిస్తే చర్యలు
పల్లెల్లో జోరుగా చర్చలు
గ్రామ సర్పంచ్‌గా ఎవరు బరిలో ఉండాలన్న విషయంపై గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు జోరుగా చర్చలు జరుపుతున్నారు.. ఏకగ్రీవం చేస్తే ఊరి అభివృద్ధికి తన సొంత డబ్బులు అందజేస్తానని పలువురు హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరికి వారే ఎవరిని బరిలో దింపితే గెలుపొందే అవకాశాలుంటాయని మండల, జిల్లా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇలా నిర్ణయం తీసుకునే గ్రామంలో ఒక్కరే నామినేషన్ వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వడ్డీలేని రుణాలు.. మాకేవి? పట్టణాల్లోని మహిళా సంఘాలకు వ
వడ్డీలేని రుణాలు.. మాకేవి? పట్టణాల్లోని మహిళా సంఘాలకు వ
వడ్డీలేని రుణాలు.. మాకేవి? పట్టణాల్లోని మహిళా సంఘాలకు వ


