లైసెన్స్‌ తుపాకులు డిపాజిట్‌ చేయండి | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ తుపాకులు డిపాజిట్‌ చేయండి

Nov 28 2025 11:41 AM | Updated on Nov 28 2025 11:57 AM

లైసెన

లైసెన్స్‌ తుపాకులు డిపాజిట్‌ చేయండి

సీపీ విజయ్‌కుమార్‌

సిద్దిపేటకమాన్‌: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున లైసెన్స్‌ కలిగిన తుపాకుల(గన్‌)ను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని సీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పీఎస్‌లలో ఈ నెల 29వ తేదీలోపు డిపాజిట్‌ చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం తిరిగి నిబంధనల ప్రకారం తీసుకెళ్లవచ్చన్నారు. డిపాజిట్‌ చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని సరిహద్దు పోలీస్‌స్టేషన్లలో ఐదు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆంగ్లంపై పట్టు సాధించాలి

నంగునూరు(సిద్దిపేట): ఆంగ్లంపై పట్టు సాధిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎంఈఓ దేశిరెడ్డి అన్నారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం మండల స్థాయిలో నిర్వహించిన ఇంగ్లిష్‌ ఒలంపియాడ్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు కన్యాలాల్‌, సుధాకర్‌, ప్రభాకర్‌రెడ్డి, భూపతిరెడ్డి, అశ్రఫ్‌, వనిత, సుశీల, హమీద బేగం, సుధాకర్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం కావాలి

డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

గజ్వేల్‌: సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్‌ మండలం రిమ్మనగూడకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మాధవరావు, నర్సింగరావు, అయిలుమల్లు తదితరులు పాల్గొన్నారు.

అందెశ్రీ సంతాప సభ

సిద్దిపేటకమాన్‌: తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో అందెశ్రీ సంతాప సభను గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏ బహిరంగ సభ, ప్రజాపోరాటం జరిగినా అందెశ్రీ ఉద్యమ గీతాన్ని వినిపించే వారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీను, పరమేష్‌, సాగర్‌, లక్ష్మణ్‌, నరేష్‌, మురళి, రేణుక, శృతి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం

రాష్ట్ర విద్యా పరిశీలన మండలి డైరెక్టర్‌ రమేశ్‌

చేర్యాల(సిద్దిపేట): ప్రతి ఉద్యోగికి పదవీ విర మణ సహజమని రాష్ట్ర విద్యా పరిశీలన మండలి డైరెక్టర్‌ గాజర్ల రమేశ్‌, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం జరిగిన ఎంఈఓ రచ్చ కిష్టయ్య పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభకు వారు హాజరై మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన కిష్టయ్య ఉన్నత చదువులు చదివి హెచ్‌ఎంగా, ఎంఈఓగా పనిచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కృషి చేశా రని ప్రశంసించారు. కిష్టయ్య దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్‌ అధికారి రమేశ్‌, బేతి భాస్కర్‌, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లైసెన్స్‌ తుపాకులు డిపాజిట్‌ చేయండి 1
1/1

లైసెన్స్‌ తుపాకులు డిపాజిట్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement