స్వచ్ఛతను కాపాడుదాం
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్
సిద్దిపేటజోన్: పట్టణంలో స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ కాపాడాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. గురువారం ఆయన పట్టణంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 3వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. త్వరలో యూజీడీ అమలు అయ్యేలా చూస్తామన్నారు. నూతనంగా మంజూరు అయిన నిధులతో వీధి దీపాలు, రోడ్లు వేస్తామని కాలనీ ప్రజలకు వివరించారు. అనంతరం 10, 26 వార్డుల్లో పర్యటించారు. సమస్యలపై అరా తీశారు. చెరువు వద్ద ఎలాంటి చెత్త వేయరాదని సూచించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో వెలువడే వ్యర్థాలు, హానికర చెత్తను ధర్మ ఏజెన్సీకి ఇవ్వాలని సూచించారు. చెత్త వేరు చేయు విధానంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. బహిరంగ ప్రాంతంలో చెత్త వేసిన వారికి రూ.1000 జరిమానా విధించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజ్, కౌన్సిలర్లు ప్రవీణ్, తిరుమల్‌రెడ్డి, బాల్‌రాజేశం, డీఈ ప్రేరణ తదితరులు పాల్గొన్నారు.


