సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి
ఆరె కటికె రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్‌పూర్ బాల్‌రాజు
గజ్వేల్: సంఘటిత పోరాటాలకు ఆరె కటికెలు సిద్ధం కావాల్సిన అవసరముందని, రాష్ట్రస్థాయిలో పటిష్ట నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆరె కటికె రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్‌పూర్ బాల్‌రాజు అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ఆరెకటిక కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి ఎన్నికలకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుంచి ఆరెకటికలను సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గం ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఆరె కటికె సంఘం రాష్ట్ర నాయకుడు కల్యాణ్‌కర్ నర్సింగరావు మాట్లాడుతూ ఆరెకటికెలను ఏకం చేయడానికి రాష్ట్రస్థాయిలో సంఘం ఏర్పాటుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఆరెకటిక కమిటీ రాష్ట్ర నాయకులు నేతిక రవికుమార్, జితేందర్, గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు మురశీధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


