పరీక్షలకు సిద్ధం కావాలి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి
హుస్నాబాద్: విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, కళాశాల అనుబంధ ధ్రువ పత్రాలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేశారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు.
చేర్యాల(సిద్దిపేట): కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే గీతన్నల రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని అర్జునపట్ల, నాగపురి, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి, కడవేర్గు గ్రామాల్లో గీతకార్మికులతో కలిసి మహాసభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు.
అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్ది ఆహారభద్రతలో చేపల పాత్ర కీలకమవుతుందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. కళాశాల జువాలజీ, ఫిషరీస్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 40 రకాల చేపలు, వాటి విత్తనోత్పత్తి, బయోప్లాక్ అక్వేరియం, అక్వాక్లినిక్, వృక్ష ఫ్లవకాలు, చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలు, పడవల రకాలు, చేపల వంటకాలు 30 వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు స్టాళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఓఈ డాక్టర్ గోపాల సుదర్శనం, జువాలజీ, ఫిషరీస్ విభాగాధిపతి డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు డా.లీలావతి, హేమలత, డా.మధుసూదన్‌రెడ్డి, విశ్వనాథ్, డా.పుణ్యమ్మ, డా.వైకుంఠం, డాక్టర్ జగదీశ్వరాచారి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, డా.మహేశ్, డా.కృష్ణయ్య, డా. ఉమామహేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.
వర్గల్(గజ్వేల్): కార్తీకం కాంతులీనింది. నాచగిరికి కాసుల వర్షం కురిపించింది. వ్రతాలు, దీపారాధనలు, ఆర్జిత సేవలు, అభిషేకాలు, కల్యాణాది పూజా కార్యక్రమాలతో శోభిల్లిన కార్తీకమాసంలో ఆలయానికి రూ.32,82,207 ఆదాయం సమకూరింది. హుండీ లెక్కిస్తే మరో రూ.10 లక్షలు పైగా వచ్చే అవకాశముంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు ఆదాయాన్ని పంచింది. అక్టోబర్ 22న కార్తీకమాసం ప్రారంభమై ఈనెల 20న ముగిసింది. ఈ సారి దాదాపు లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం వివిధ పద్దుల ద్వారా కార్తీకంలో రూ.32,82,207 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు పేర్కొన్నారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రవీందర్‌గుప్తా, ధర్మకర్తలు, అర్చక సిబ్బంది భక్తజనోల్లాసం మధ్య కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు.
పరీక్షలకు సిద్ధం కావాలి
పరీక్షలకు సిద్ధం కావాలి
పరీక్షలకు సిద్ధం కావాలి


