కల్యాణం.. కమనీయం
తిలకిస్తున్న భక్తులు
సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంతో అలరారింది. బుధవారం వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. క్షేత్రంలో అభిషేకాలు, అర్చనలు, కల్యాణాది కార్యక్రమాలతో భక్తిభావనలు ఉప్పొంగాయి. తెల్లవారుజామున అర్చక పరివారం వేద మంత్రోచ్ఛరణల మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు మొదలయ్యాయి. గర్భగుడిలో కొలువైన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణలు, భక్తజన హర్షధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులకు మాంగళ్యధారణ చేశారు. కమనీయంగా సాగిన కల్యాణ వైభోగాన్ని భక్త జనులు తిలకించి పరవశించారు. – వర్గల్(గజ్వేల్)
కల్యాణం.. కమనీయం


