సంగ్రామమే.. | - | Sakshi
Sakshi News home page

సంగ్రామమే..

Nov 27 2025 10:45 AM | Updated on Nov 27 2025 10:45 AM

సంగ్ర

సంగ్రామమే..

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డుల్లో వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నామినేషన్లను ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట

దౌల్తాబాద్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, మర్కూక్‌, ములుగు, రాయపోలు, వర్గల్‌ మండలాల్లో మొదటి విడతలో సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లో ఐదు నుంచి ఆరు గ్రామ పంచాయతీలకు కలిపి నామినేషన్లను స్వీకరించేందుకు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 163 గ్రామాలకు 41 క్లస్టర్లను ఏర్పాటు చేసి వీటికి రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)లను 54 మందిని, ఏఆర్వోలను 54 మందిని నియమించారు.

డిసెంబర్‌ 3న ఉపసంహరణ

గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. డిసెంబర్‌1 వరకు అప్పిళ్లు, 2వ తేదీ వరకు పరిష్కారం, 3న నామినేషన్లను విత్‌ డ్రా చేసుకోవచ్చు. అదే రోజుపోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. మండల కేంద్రాల్లో 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. మొదటి విడతలో 1,92,749 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మండలాల వారీగా ఓటర్ల వివరాలిలా..

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

దౌల్తాబాద్‌ 11,974 12,510 0 24,484

గజ్వేల్‌ 16,544 17,460 02 34,006

జగదేవ్‌పూర్‌ 15,305 15,993 0 31,298

మర్కూక్‌ 9,575 9,918 0 19,493

ములుగు 15,440 15,615 0 31,055

రాయపోలు 10,524 11,005 0 21,529

వర్గల్‌ 15,258 15,626 0 30,884

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): సర్పంచ్‌ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసిన ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను బుధవారం జగదేవ్‌పూర్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పరిశీలించారు. పోలింగ్‌బూత్‌ల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశామని ఎస్‌ఐ తెలిపారు.

తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డులు

108 మంది ఆర్వో, ఏఆర్వోల నియామకం

సంగ్రామమే..1
1/1

సంగ్రామమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement