లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
సిద్దిపేటకమాన్: కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఉద్యోగ భద్రత లేకుండా కార్మిక కోడ్‌లను రూపొందించారని అన్నారు. దీంతో కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతోందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకువచ్చిన కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో గోపాలస్వామి, లక్ష్మణ్, మల్లేశం నర్సింహులు, శ్రీనివాస్, శశిధర్, వెంకట్, భాస్కర్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


