ఇందిరమ్మ చీరలు
● నేటి నుంచి పంపిణీ..
● జిల్లాలో లక్షా 99వేల మందికి అందించేందుకు ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద శుక్రవారం నుంచి చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ పండుగ నాటికే పంపిణీ చేయాలని భావించినప్పటికీ చీరలు సిద్ధం కాకపోవడం, స్థానిక ఎన్నికల కోడ్ దృష్ట్యా వాయిదా వేశారు. ఒక్కో మహిళకు ఒక్కో చీర చొప్పున అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల వివరాలు సేకరించారు. జిల్లాలో 1,99,000 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. మొదటగా కోహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం మొదటగా పంపిణీ చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చీరలను గోదాముల నుంచి సరఫరా చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– జయదేవ్ ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి


