మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
● స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్
● పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లనామస్మరణతో మారుమోగాయి. కలెక్టర్ హైమావతి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పట్నా లు, అర్చన, ఒడిబియ్యం సమర్పించారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని బోనం చెల్లించారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయఅధికారులు పర్యవేక్షించారు.
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం


