ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
● ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం
● పాల్గొన్న మంత్రి పొన్నం దంపతులు
హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లో విజయాలు చేకూరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం దంపతులు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు, పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.


