దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి

Oct 14 2025 8:49 AM | Updated on Oct 14 2025 8:49 AM

దుబ్బ

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి బంద్‌ ప్రశాంతం రిజర్వేషన్లు అడ్డుకుంటే బుద్ధిచెప్పడం ఖాయం హమాలీల సమస్యలు పరిష్కరించండి

ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్‌ విజ్ఞప్తి

దుబ్బాక: స్థానిక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్‌లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కిలోమీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్‌లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎంను నియమించి 60 బస్‌లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. దుబ్బాక డిపో నుంచి నిజామాబాద్‌, శ్రీశైలం, కరీంగనర్‌, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర రూట్లలో కొత్త బస్‌లు ప్రారంభించాలని ఎండీ నాగిరెడ్డిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ప్రైవేట్‌ విద్యా సంస్థలు బంద్‌ పాటించాయి. సోమవారం కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పూర్తి స్థాయిలో, మరిన్ని పాక్షికంగా బంద్‌ చేపట్టాయి.

జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి

వర్గల్‌(గజ్వేల్‌): బీసీ బిల్లు అమలుపై అన్ని వర్గాలు కలిసిరావాలని, బిల్లు అడ్డుకునే రాజకీయ శక్తులకు తగిన బుద్ధి చెబుతామని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. సోమవారం వర్గల్‌ మండలం గౌరారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్‌ అంశంపై అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి, అందుకు కట్టుబడాలన్నారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని, బీసీ బిడ్డ బండి సంజయ్‌ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడం శుభ పరిణామమన్నారు. సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పార్టీలన్నీ చౌకబారు విమర్శలుమానుకుని కలిసిరావాలని సూచించారు.

చేర్యాల(సిద్దిపేట): హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలో హమాలీ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం రేపాక కుమార్‌ అధ్యక్షతన పట్టణంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాలస్వామి మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించడంలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పని చేస్తున్న హమాలీలకు లారీ ఓనర్లు ఇచ్చే తాడుకట్టే వేతనం పెంచాలని సూచించారు. వారికి ప్రమాద బీమా, పని భద్రత, కనీసవేతనం, 55 ఏళ్లు దాటిన వారికి పింఛన్‌ సదుపాయాలను కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌ మావో, హమాలీ కార్మిక నాయకులు పాల్గొన్నారు.

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి 
1
1/2

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి 
2
2/2

దుబ్బాక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement