
ఉదయం కోలాహలం.. సాయంత్రం నిర్మానుష్యం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు నేపథ్యంలో మిరుదొడ్డిలో గురువారం ఉదయం అభ్యర్థులతో కోలాహలం నెలకొంది. ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో నామినేషన్ కౌంటర్లు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందించడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అభ్యర్థులు, నాయకులతో ప్రభుత్వ కార్యాలయాలు, జీరాక్స్ సెంటర్లు కిటకిటలాడాయి. తీరా సాయంత్రం వేళ హైకోర్టు ఎన్నికలపై ఆరు వారాలు స్టే విధించడంతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అవాక్కయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు.

ఉదయం కోలాహలం.. సాయంత్రం నిర్మానుష్యం