
కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టుడే..
ఆ దిశగా ప్రజలను సిద్ధం చేయాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
కొండపాక(గజ్వేల్): హామీలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేలా ప్రజలను సిద్ధం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని దుద్దెడకు చెందిన మాజీ ఎంపీపీ అనంతుల పద్మతో పాటు సుమారు 100 మంది గురువారం హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో అనంతుల పద్మ భర్త నరేందర్‌లు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ పనితీరు నచ్చక అనతి కాలంలోనే మళ్లీ అనుచరులతో యూటర్న్‌గా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పరిపాలనను గాలికొదిలేసి ప్రతీకార చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వివిధ రకాల పెన్షన్ల పెంపు మాట దేవుడెరుగు.. పాత వాటిలో కోత పెట్టిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనంతుల అశ్విణి, నాయకులు ర్యాగల్ల దుర్గయ్య, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, అంజయ్య, కోడెల ఐలయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.