ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

Sep 27 2025 8:28 AM | Updated on Sep 27 2025 8:28 AM

ప్రిస

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

దుబ్బాకటౌన్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్‌ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఐఓసీ కార్యాలయంలో ఉదయం అక్బర్‌పేట భూంపల్లి, మధ్యాహ్నం వివిధ మండలాల ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులకు మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జహీరోద్దిన్‌, ఎంపీఓ బాలాజీ, మాస్టర్‌ ట్రైనర్లు శ్రీహరి, రవీందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

సర్వేకు సహకారం అవసరం

మిరుదొడ్డి(దుబ్బాక): పంటల సర్వేకు రైతులు సహకరించాలని ఏడీఏ మల్లయ్య కోరారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సాగైన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ల ప్రకారం పంటలు వివరాలు నమోదు చేయాలన్నారు. దీనివల్ల దిగుబడిని విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటా యని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్‌, ఏఈఓ సాయి కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

చెరువు కట్టకు మరమ్మతులు

గజ్వేల్‌రూరల్‌: మండల పరిధిలోని పిడిచెడ్‌ గ్రామంలోగల లక్ష్మీదేవి చెరువుకట్టకు గండిపడే అవకాశం ఉండడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్‌ ఏఈ సుశాంత్‌ పర్యవేక్షణలో శుక్రవారం చెరువుకట్టపై మట్టి పో యించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడితే సుమారు 200 ఎకరాల పరిధిలోని పంటలు నీటమునిగే ప్రమాదముంటుందన్నారు. వారం రోజుల క్రితం చెరువుకట్ట పొలాలవైపు కుంగిపోతున్నట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టా మని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

మద్దూరు(హుస్నాబాద్‌): సీజనల్‌ వ్యాధులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆనంద్‌ సూచించారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో నిర్వహించిన స్వస్థ్‌ నారి సశక్తి అభియాన్‌ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాధుల సోకిన వారు వెంటనే వైద్యులను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సత్వర సేవలందించడమే లక్ష్యం

వర్గల్‌(గజ్వేల్‌): ఖాతాదారులకు సత్వర సేవలందించడమే తమ లక్ష్యమని గౌరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ సీహెచ్‌ మాతాజీ అన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్‌లో భాగంగా ఐకేపీ పర్యవేక్షణలో ఏర్పాటైన ఐదు స్వయం సహాయక వృద్ధుల సంఘాలకు శుక్రవారం బ్యాంకు ఖాతాలు తెరిపించి పాస్‌ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో పాములపర్తి సీసీ పద్మలత, మహిళలు పాల్గొన్నారు.

రేషన్‌ డీలర్ల సంఘం

అధ్యక్షుడిగా గోపి

హుస్నాబాద్‌: మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా మాటూరి గోపి ఎన్నికయ్యారు. డీలర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం గోపి, యాదగిరి పోటీపడ్డారు. ఒక్క ఓటు తేడాతో మాటూరి గోపి ఎన్నికై నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. కార్యదర్శిగా గూళ్ల మంగ, కోశాధికారిగా మల్లేశం ఎన్నికయ్యారు.

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ 
1
1/3

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ 
2
2/3

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ 
3
3/3

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement