జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది | - | Sakshi
Sakshi News home page

జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది

Sep 27 2025 8:28 AM | Updated on Sep 27 2025 8:28 AM

జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది

జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది

మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు తాము ఎంచు కున్న లక్ష్యాన్ని సాధించాలంటే చదువే పునాది అని డీఐఈఓ కె.రవీందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర అన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్‌ కె.శారద, అధ్యాపకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల సహకారం అవసరం

సిద్దిపేటఎడ్యుకేషన్‌/ములుగు(గజ్వేల్‌)/వర్గల్‌(గజ్వేల్‌)/నంగునూరు(సిద్దిపేట)/గజ్వేల్‌రూరల్‌/హుస్నాబాద్‌: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాలలో ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌ సత్యనారాయణరెడ్డి, హిమబిందు మాట్లాడారు. కళాశాలలకు అందిస్తున్న నిధులు, సౌకర్యాలు, విద్యార్థుల స్థితిగతులను తల్లిదండ్రులకు వివరించారు. కోఎడ్యుకేషన్‌ కళాశాలలో అగ్నిమాపక సీఐ వెంకటేశ్వర్లు అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో వివరించారు. ఏజీఎంసీ దేవయ్య, సుధాకర్‌రెడ్డి, కనకచంద్రం, శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్‌, అశోక్‌ పాల్గొన్నారు. అలాగే ములుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శశికళ మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో విలువ పెరుగుతుందన్నారు. వర్గల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు విద్యార్థుల అకడమిక్‌, నాన్‌ అకడమిక్‌ అంశాలను చర్చించారు. నంగునూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్‌ శివకోటి మాట్లాడారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ కిషన్‌ నగదు బహుమతులు అందజేశారు. గజ్వేల్‌ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ శ్రీనివాస్‌గౌడ్‌, జ్యోతిర్మయి వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలలో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతి బాటలో తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి రావాలన్నారు. అలాగే బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థులు కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నామని ప్రిన్సిపాల్‌ లలిత అన్నారు.

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement