
బీసీ రిజర్వేషన్లపై జీఓ ఏదీ?
● స్థానిక సంస్థల ఎన్నికలపై రోజుకో మాట ● ఉపాధ్యాయుల సెలవులపై పునరాలోచించాలి ● ఎంపీ రఘునందన్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన జీఓ విడుదల చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభత్వుం రోజుకో మాటమాట్లాడుతోందన్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులు గుంతల మయంగా మారాయన్నారు. రహదారులపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రకృతి కోపిస్తే ఇలాగే ఉంటుందని, అందువల్ల పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు దోచుకున్న డబ్బుతో ఏమి చేయాలో తెలియక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిని బయటకు తీస్తామన్న కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటోందన్నారు. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు పెద్ద పండుగలని, మహిళా ఉపాధ్యాయులను విధులకు హాజరుకావాలని హుకుం జారీ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్, వెంకట్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఉనికి కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆరాటం
వర్గల్(గజ్వేల్): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం వర్గల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో రోడ్లు ఎక్కడా సరిగాలేవు. నాణ్యత కొరవడ్డాయి. అన్నీ గోతులే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ప్రజల మేలు కోసం పనులను చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రస్థానం ముగిసింది
చిన్నకోడూరు(సిద్దిపేట): స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో బీఆర్‌ఎస్ ప్రస్థానం ముగిసిందని.. బీఆర్‌ఎస్‌లో ఏ నాయకుడు ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సేవా పక్షంలో భాగంగా గురువారం చిన్నకోడూరులో మొక్కలు నాటి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపలేదా అని ప్రశ్నించారు. నాడు ఒక మాట, నేడు ఒక మాట మాట్లాడటం బీఆర్‌ఎస్‌కు చెల్లుతుందన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే బీఆర్‌ఎస్ నాయకులను తరిమి కొడతామన్నారు.