
నాచ‘గిరి’ ప్రదక్షిణం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికత పంచుతున్న వేళ.. ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో ‘గిరి ప్రదక్షిణ’ క్రతువుకు బీజం పడింది. గురువారం ఉదయం భక్తజన హర్షధ్వానాలు, నారసింహ స్మరణ మధ్య పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభించారు. ప్రముఖులు, అర్చక, వేదపండితులు, సిబ్బంది, భక్తజనులు ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. భజనలు చేస్తూ గిరిప్రదక్షిణ చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ గిరిప్రదక్షిణతో శుభాలు కలుగుతాయన్నారు. – వర్గల్(గజ్వేల్)