
మద్యం టెండర్లకు వేళాయె..
వచ్చేనెల 18 వరకు గడువు 23న లక్కీ డ్రా గౌడ సామాజిక వర్గానికి 16, ఎస్సీలకు 9 కేటాయింపు
కొత్త మద్యం పాలసీ(2025–27)ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం నుంచి మద్యం షాప్‌లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2023–25 మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్‌లకు 4,166 మంది దరఖాస్తు చేశారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఉన్న 93 వైన్ షాప్‌లకు శుక్రవారం నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. షాప్‌ల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి అక్టోబర్ 23న లక్ష్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తులను సిద్దిపేటలో ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో స్వీకరించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తు ధరను రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. కొత్త షాప్‌లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు వేల నుంచి 50వేల జనాభా ఉన్న దుకాణాలకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష మంది వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు.
డ్రా తీసిన కలెక్టర్
దుకాణాల కేటాయింపు గౌడ సామాజిక వర్గానికి 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను గురువారం కలెక్టర్ హైమావతి తీశారు. జిల్లాలో 93 వైన్ షాప్‌లు ఉండగా గౌడ సామాజిక వర్గానికి 16, ఎస్సీలకు 09 షాప్‌లు కేటాయించారు. గౌడ కులస్తులకు దుబ్బాక పట్టణం( గెజిట్ నంబర్ 19), చిన్నకోడూరు(21), గజ్వేల్ పట్టణం(27), గజ్వేల్ పట్టణం(29), గజ్వేల్ పట్టణం(31), ముట్రాజ్‌పల్లి(36), ములుగు(42), వేలురు(వర్గల్, (47), గౌరారం(48), మర్కూక్(49), హుస్నాబాద్ పట్టణం(54), పోతారం( హుస్నాబాద్, 56) చేర్యాల పట్టణం(68), దుద్దెడ–1(75), దూల్మిట్ట (80), అక్బర్‌పేట–1(85)లను కేటాయించారు.
ఎస్సీలకు..
సిద్దిపేట పట్టణం(8), సిద్దిపేట పట్టణం(14), దుబ్బాక పట్టణం(16), రాఘవాపూర్(24), గజ్వేల్ పట్టణం(32), గజ్వేల్ పట్టణం( 35), చేర్యాల పట్టణం(70), కొమురవెల్లి–1(81), రాయపోలు(89) కేటాయించారు. ఎస్టీలకు వైన్ షాప్‌లను కేటాయించలేదు. రిజర్వేషన్‌ల ప్రకారం దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. ఎకై ్సజ్ చట్టం 1968 ప్రకారం శిక్షపడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. మద్యం వ్యాపారులు, ఆశావహులు సిండికేట్‌గా మారి దరఖాస్తు చేసేందుకు డబ్బులను సిద్ధం చేసుకుంటున్నారు.
తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్‌ల దరఖాస్తుల స్వీకరణ కోసం సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల రెండు చొప్పున, మిరుదొడ్డి ఒకటి కౌంటర్లు ఉండనున్నాయి. దరఖాస్తు దారులు అందరూ ఆయా కౌంటర్లలో దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాస మూర్తి, ఈఎస్
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ