
రుణ లక్ష్యాన్ని సాధించాలి
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం
సిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ద్వారా ప్రజల్లో డిజిటల్ మోసాల నివారణ, సోషల్ సెక్యూరిటీ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఎక్కువగా రుణాలు అందించాలని కోరారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు అందించాల్సిన రుణాల్లో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. బ్యాంకర్లకు ఇచ్చిన టార్గెట్‌ను బట్టి రుణాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ జయదేవ్‌ఆర్యా, ఆర్‌బీఐ ఏజీఎం గోమతి, నాబార్డు డీడీఎం నిఖిల్, ఎల్‌డీఎం హరిబాబు, యూబీఐ ఆర్‌హెచ్ శ్రీనివాస్, ఎస్‌బీఐ ఆర్‌ఎం మారుతి, మెదక్ డీసీసీబి డీజీఎం విశ్వేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.